Sunday, January 2, 2011

నిత్యానంద నన్ను బెదిరిస్తున్నాడు: సెక్స్ స్వామిపై లెనిన్ కరుప్పన్

Nityananda Swami
బెంగళూరు: నిత్యానంద స్వామి తనను బెదిరిస్తున్నాడని, తన బాధితులను కూడా బెదిరిస్తున్నాడని నిత్యానంద స్వామి మాజీ ముఖ్య శిష్యుడు లెనిన్ కరుప్పన్ ఆరోపించారు. నిత్యానంద స్వామి తనను ఇది వరకే బెదిరించాడని, తనపై కేసులు పెట్టాలని తన శిష్యులను ప్రేరేపిస్తున్నాడని, ఇప్పుడు సాక్షులను, బాధితులను వేధిస్తున్నాడని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. సినీ నటి రంజితతో నిత్యానంద స్వామి రాసలీలల వీడియో లెనిన్ కరుప్పన్ బయట పెట్టిన విషయం తెలిసిందే.

నిత్యానంద స్వామి నిజస్వరూపం భక్తులకు తెలిసిపోయిందని, సెక్స్ స్కామ్ తర్వాత చాలా మంది నిత్యానందను వదిలి వెళ్లిపోయారని ఆయన అన్నారు. చాలా మంది తనను అభినందించారని, వ్యక్తిగతంగా తనకు మద్దతిచ్చారని ఆయన అన్నారు. నిత్యానంద స్వామి బెదిరింపుల వల్ల, ఒత్తిడి వల్ల బయటకు రావడానికి భయపడుతున్నారని ఆయన చెప్పారు

No comments: