Saturday, September 21, 2013

శోభనం గదిలో సొగసైన విధానాలు మీకు తెలుసా?
















new couple

స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువు. కొత్త అనుభవం, కొత్త పరిసరాలంటే కొంత జంకుగా ప్రవర్తిసుంటారు. కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కు నెడుతుంటుంది. సిగ్గు, భయం, కంగారు ఆమెను ముందుకు ఉపక్రమించేలా చేయనివ్వవు. అందుకే.. శోభనం రాత్రి గానీ, ఆ తర్వాత గానీ కొత్త పెళ్ళి కొడుకు మెళకువగా, సున్నితంగా వ్యవహరించాలి. లేకుంటే.. తొలి మూడు రోజుల్లోనే నవ దంపతుల మధ్య స్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవే మున్ముందు పెరిగి పెద్దవై వివాదాలకు దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు.

నవ వధువుకి భర్తపై ప్రత్యేక ప్రేమ కలగాలంటే అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసంతో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడుతూ ఉండాలి. చక్కటి సందర్భోచిత మాట తీరుతో ఆకట్టుకోవాలి. ఏ విషయానికి తొందరపడరాదు. దాంపత్య జీవితం అనేది తొలి రాత్రితోనే ముగిసిపోయేది కాదు కాబట్టీ.. ఆచితూచి అడుగులు వేయాలి.

అలాకాకుండా తొలి రోజునే ఆమెను ఇబ్బందికి గురి చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం.. తన భర్త మంచి మనస్సు వ్యక్తికాదనే ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. అలాకాకుండా.. ఓ జంతువులా ప్రవర్తించి... ఆ తొలిరేయి తొలి నిమిషాల్లోనే అతను తొందరపడితే ఆమె భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. ఇదే సెక్స్‌ అంటే విముఖతకు దారి తీసే ప్రమాదం ఉంది.

కొత్త పెళ్ళి కూతురు ఎప్పుడూ కొంత ప్రేమను, నాజూకుతనాన్ని కోరుకుంటుంది. ఆమె పాలగ్లాసుతో అడుగుపెట్టగానే ఆతృతగా కౌగిలించుకొని, ఇనుప కౌగిలిలో బిగించుకొని, బలవంతంగా ఆమెను వివస్త్రరాలిని చేసి, వారిస్తున్నా అంగప్రవేశానికి ఉపక్రమిస్తే ఆమెలో అసహ్యం, ఆగ్రహం పెల్లుబుకుతాయి.

తొలి రోజున... పరిసరాలకు, ఆమె మనస్సుకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. ప్రధానంగా శోభనం రాత్రే సంభోగానికి ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండరు. అందుకే.. భార్యను దగ్గరకు తీసుకుని.. సున్నితంగా తాకుతూ మాటల్లో దించి.. మెల్లగా అసలు విషయంలోకి తీసుకెళితేనే దారికి వస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

No comments: