విజయవాడ: తాను ప్రజారాజ్యం పార్టీతోనే ఉన్నానని విజయవాడకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ఆదివారం స్పష్టం చేశారు. ఆదివారం వంగవీటి రంగా 22వ వర్ధంతి సందర్భంగా ఆయన రంగా విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ పార్టీలో చేరనున్నట్లు తనపై మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని చెప్పారు. తమ నాయకుడు, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవికి తప్పుడు సంకేతాలు ఏమీ లేవని చెప్పారు.
పార్టీలో తనకెలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మా పార్టీ కార్యకర్తలతో పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే విషయంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశాము. అంతేగానీ వేరే పార్టీలోకి వెళ్లాలనే ఎలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంలో ప్రస్తుతం తాము ఉన్నామని చెప్పారు.

No comments:
Post a Comment