విజయవాడ, నెల్లూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ అభిమానులపై కొందరు దాడికి దిగారు. న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జగన్ అభిమానులపై విజయవాడలో దాడులు జరిగాయి. తీవ్రంగా గాయపడ్డ అభిమానులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయవాడకు చెందిన జగన్ వర్గీయులు న్యూఇయర్ సందర్భంగా కేట్ కట్ చేయడానికి సన్నద్ధమయిన సందర్భంలో వ్యతిరేక వర్గం వారు కర్రలతో వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా తమను ఎదుర్కొనలేకే ఈ దాడికి దిగారని జగన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడతారని తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో అన్నారు. జగన్ కు మద్దతిస్తున్న పలు పార్టీల వారిని ఆయన కలిశారు. కాంగ్రెస్ పార్టీ నేతల కుటీల రాజకీయాలను ఎండగడుతూ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జగన్‌మోహన్‌రెడ్డికి జనం విశేషంగా ఆదరిస్తున్నారన్నారు.

No comments:
Post a Comment