దంపతుల మధ్య శృంగారం ఓ ప్రధామైన విషయం. అయితే, దాన్ని బహిరంగంగా చర్చించడానికి చాలా మంది ఇష్టపడరు. స్త్రీపురుషులు దంపతులుగా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత శృంగారమన్నది వారి జీవితంలో ఓ ప్రధానమైన అంశంగా మారుతుంది. శృంగారమన్నది కేవలం శారీరక వాంఛను తీర్చే ఓ అవసరం మాత్రమే కాదు. దంపతుల మధ్య చక్కని అన్యోన్యతను, బంధాన్ని పెంచడానికి అది తోడ్పడుతుంది. అయితే అన్ని విషయాల గురించి చర్చించే దంపతులు శృంగారం విషయంలో తమకు ఏం కావాలి, తాము తమ సహచరికి ఏమి ఇవ్వాలి అన్న విషయంలో మాత్రం మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపరు. తరతరాలుగా వస్తున్న నమ్మకాలు, అపోహలు కలిసి ఈ విషయంలో వారిని మాట్లాడనీయకుండా వారిలో ఓ రకమైన అలజడిని సృష్టిస్తాయి.
భర్త దగ్గర సెక్స్ గురించి విపులంగా మాట్లాడితే ఎక్కడ తన గురించి తప్పుగా అనుకుంటాడేమో అని భార్య మాట్లాడదు. అలాగే పురుషాధిక్య సమాజంలో పెరిగిన మగవారు సైతం భార్య దగ్గర సెక్స్ గురించి మాట్లాడితే తమ అహం తగ్గిపోతుందేమోనని భావిస్తారు. ఇలా తయారైన భార్యాభర్తల మధ్య చివరకు శృంగారం కూడా ఓ రొటీన్ కార్యక్రమంలాగా మారిపోతుంది. తన భార్య ఇష్టంతో సంబంధం లేకుండా కేవలం తన కోరిక మాత్రమే తీర్చుకుని భర్త చల్లబడిపోతుంటాడు. అలాగే భర్తకోసమే అన్నట్టు ఆ కొన్ని క్షణాలు శరీరాన్ని అప్పగించేసి శృంగారంలో ఏమాత్రం అనుభూతి లేకుండా భార్యలు కాలం వెళ్లదీస్తుంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవ్వడానికి గల కారణాలు చాలా చిన్నవే.
కలిసి మాట్లాడుకోవాలన్న ఆలోచనలేక పోవడం, మనసులోని అపోహలను తొలగించుకుందామనే సృహ లేకపోవడం వంటి చిన్న కారణాలే దంపతుల శృంగారజీవితంలో పెను అగాధాలను సృష్టిస్తాయి. అయితే జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు శృంగారం విషయంలో అరమరికలు లేకుండా ప్రవర్తించగలిగినపుడే వారి దాంపత్యం సైతం చక్కగా కొనసాగుతుంది. అలా కాకుండా శృంగారంలో బాధ్యత వహించాల్సింది కేవలం తమ భాగస్వామి మాత్రమే అని మనసులో అనుకుంటూ తాముగా చొరవ చూపకుండా ప్రవర్తిస్తూ పోతే చివరకు శృంగారం అంటేనే విసుగుపుట్టే స్థాయికి చేరుకునే ప్రమాదముంది. అలాంటి ప్రమాదం ఒక్కసారి ఎదురైతే ఆ దంపతుల దాంపత్యం నిత్యం కలతలతో కొనసాగుతుంది.
No comments:
Post a Comment