Showing posts with label ప్రజారాజ్యం. Show all posts
Showing posts with label ప్రజారాజ్యం. Show all posts

Friday, December 31, 2010

పంచె కట్టుకొని వస్తే చంద్రబాబును రైతులు నమ్మరు: ప్రజారాజ్యం

C Ramachandraiah
హైదరాబాద్: పంచె కట్టుకొని రైతుకోసం అంటూ మహాసభకు వచ్చినంత మాత్రాన రాష్ట్రంలోని రైతులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నమ్మరని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు సి రామచంద్రయ్య శుక్రవారం విలేకరుల సమావేశంలో ఉన్నారు. చంద్రబాబు పక్కనే కూర్చున్న మాజీ ప్రధానమంత్రి, కర్ణాటక నేత దేవేగౌడ అల్మట్టి డ్యాం ఎత్తు పెంచి రైతులకు అన్యాయం చేశారన్నారు. రైతులను విస్మరించి తప్పు చేశానని చంద్రబాబునాయుడు పశ్చాత్తాపపడితే రైతులకు, ప్రజలకు ఆయనపై నమ్మకం కుదురుతుందన్నారు.

చంద్రబాబు రైతుల సమస్యలపై చిత్తశుద్దితో ఉద్యమిస్తే మేం ఆయన వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీకృష్ణ కమిటీ ముమ్మాటికీ సమైక్యాంధ్రనే బలపరుస్తుందని మాకు విశ్వాసం ఉందని చెప్పారు. అనుకోని కారణంగా కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తే పార్టీలోనే మాట్లాడి నిర్ణయిస్తామని చెప్పారు. హోమంత్రి చిదంబరం అఖిలపక్షానికి ఒక్కో పార్టీనుండి ఒక్కరిని పిలిస్తే బాగా ఉండేదన్నారు.