Showing posts with label ysr jagan. Show all posts
Showing posts with label ysr jagan. Show all posts

Sunday, January 2, 2011

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గీయులపై విజయవాడలో కర్రలతో దాడి

YS Jagan
విజయవాడ, నెల్లూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌ అభిమానులపై కొందరు దాడికి దిగారు. న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జగన్ అభిమానులపై విజయవాడలో దాడులు జరిగాయి. తీవ్రంగా గాయపడ్డ అభిమానులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయవాడకు చెందిన జగన్ వర్గీయులు న్యూఇయర్ సందర్భంగా కేట్ కట్ చేయడానికి సన్నద్ధమయిన సందర్భంలో వ్యతిరేక వర్గం వారు కర్రలతో వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా తమను ఎదుర్కొనలేకే ఈ దాడికి దిగారని జగన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడతారని తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో అన్నారు. జగన్ కు మద్దతిస్తున్న పలు పార్టీల వారిని ఆయన కలిశారు. కాంగ్రెస్ పార్టీ నేతల కుటీల రాజకీయాలను ఎండగడుతూ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జగన్‌మోహన్‌రెడ్డికి జనం విశేషంగా ఆదరిస్తున్నారన్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేయను, త్వరలో తెలంగాణలో ఓదార్పు: వైఎస్ జగన్

YS Jagan
హైదరాబాద్: రానున్న ఉప ఎన్నికల్లో పులివెందుల శాసనసభ్యుడిగా పోటీ చేయనని మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు. శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ప్రభుత్వాన్ని కూలదోస్తాడు అనే అపవాదు తనకు వస్తుందని, అందుకే కడప నుండి పార్లమెంటు సభ్యుడిగానే పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. కాగా ఆయన పులివెందుల సమావేశాలలో కూడా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితీ 1994 కంటే దారుణంగా ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మూడో స్థానానికి కూడా దిగజారవచ్చునన్నారు. ఆ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం లేదన్నారు. తెలంగాణలో త్వరలో ఓదార్పు యాత్రను చేపడతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణం తట్టుకోలేక పలువురు మృతి చెందారని వారిని ఓదార్చడానికి త్వరలో తెలంగాణలో యాత్ర చేపడతానని చెప్పారు.