Showing posts with label ప్రభుదేవా. Show all posts
Showing posts with label ప్రభుదేవా. Show all posts

Friday, December 31, 2010

నయనతార, ప్రభుదేవా పెళ్ళికి లైన్ క్లియర్ అయ్యింది

Nayantara-Prabhu Deva
గత సంవత్సరకాలంగా వివాదంగా మారిన నయనతార, ప్రభుదేవా వివాహం కు చిక్కులు తొలిగినట్లే అని తెలుస్తోంది. ప్రభుదేవా భార్య రమాలత..విడాకుకు ఒప్పుకుందని సమాచారం. అయితే ఆమె భరణంగా తన బిడ్డల భవిష్యత్ కోసం పెద్ద మొత్తాన్నే స్వీకరించి, ఈ విడాకులకు ఒప్పుకుందని చెప్తున్నారు. ఈ విషయం నయనతారకు చాలా రిలీఫ్ ని ఇచ్చింది. ఆమె ప్రేమకధను సుఖాంతం చేసింది. ఈ వివాహం కోసం ఆమె చాలా సినిమాలు రిజెక్టు చేసింది. ఈ క్రమంలో ఆమె చేస్తున్న చివరి చిత్రం బాపు దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న శ్రీరామ రాజ్యం...అందులో ఆమెది సీత పాత్ర కావటం విశేషం. ఇక వివాహం అనంతరం ఆమె మళ్లీ తన కెరీర్ ని ప్రారంబిస్తుందని చెప్తున్నారు.

నయనతారతో ఎఫైర్ సాగిస్తున్న ప్రభుదేవాకు తాళి కట్టిన భార్య రమలత నుంచి సమస్య ఎదురైన సంగతి తెలిసిందే. నయనతార నుంచి తన భర్తను విడిపించి అప్పగించాలని ఆమె చెన్నైలోని కుటుంబ సంక్షే మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుదేవా, నయనతారల పెళ్లిని అడ్డుకోవాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. తనకు న్యాయం చేయమంటూ కోర్టుకు వెళ్ళటంతో...ప్రభుదేవా అస్సలు ఆమె తన భార్యే కాదని, తమ పెళ్ళి రిజిస్ట్రేషన్ జరగలేదని, అలాంటప్పుడు అది చట్ట సమ్మతమైన వివాహం కాదని వాదించటానికి రెడీ అయ్యారు. అయితే ఈ లోగా ఓ ప్రముఖ సినీ నిర్మాత జోక్యంతో ఈ వ్యవహారం మొత్తం ఓ కొలిక్కి వచ్చింది.