Showing posts with label VIJAYAWADA. Show all posts
Showing posts with label VIJAYAWADA. Show all posts

Sunday, January 2, 2011

రాష్ట్రాన్ని విభజించండి: మళ్లీ తెర మీదికి జై ఆంధ్ర నాయకులు

Vasantha Nageswara Rao
విజయవాడ: జై ఆంధ్ర ఉద్యమం మళ్లీ తెర మీదికి వచ్చింది. మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు నేతృత్వంలోని జై ఆంధ్ర ఉద్యమం గత కొలంగా చడీ చప్పుడ లేకుండా ఉంది. తాజాగా, శనివారం ఉదయం జై ఆంధ్ర నాయకులు విజయవాడలో సమావేశమై రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో వసంత నాగేశ్వర రావు, కృష్ణమూర్తిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని విభజించాలని వారు అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణవారు వద్దంటుంటే కలిసి ఉందామని సీమాంధ్ర నాయకులు అనడం సిగ్గుచేటు అని వారు వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు సమైక్యాంధ్ర నినాదం ఇవ్వడాన్ని వారు తప్పు పట్టారు. ఆంధ్రలో అన్ని రకాల వసతులు ఉన్నాయని, విడిపోయి అభివృద్ధి చెందుదామని వారన్నారు.