Showing posts with label స్త్రీ వక్షోజాలనే తొలుత చూస్తారా. Show all posts
Showing posts with label స్త్రీ వక్షోజాలనే తొలుత చూస్తారా. Show all posts

Friday, January 7, 2011

స్త్రీ వక్షోజాలనే తొలుత చూస్తారా

పురుషుల కళ్లు మొదట పడేది తమ వక్షోజాలపైనే అని మహిళలు తరుచూ చెబుతుంటారు.
అది నిజమేనని ఓ శాస్త్రీయ అధ్యయనలో తేలింది. దాదాపు 47 శాతం మంది పురుషుల
కళ్లు మొదట స్త్రీల వక్షోజాలపైనే పడుతాయని ఆ అధ్యయనంలో తేలింది. కేవలం 20
శాతం మంది పురుషులు మాత్రమే స్త్రీల ముఖారవిందంపై దృష్టి సారిస్తారట.
యుకెకు చెందిన డైలీ మెయిలీ ఈ మేరకు ఈ వార్తాకథనాన్ని ప్రచురించింది.

తొలుత వక్షోజాలపై చూపులు పారేయడమే కాకుండా ఎక్కువ సేపు కూడా వాటి మీదనే
కళ్లు పెడతారట. స్త్తీలలోని ఏ అవయవం మీద కూడా పురుషులు అంత సేపు చూపులు
పెట్టరని అధ్యయనంలో తేలింది. జెన్నిఫర్ హాకిన్స్, లారా బింగిల్, రాచెల్
ఫించ్‌ల్లో మాదిరిగా బరువైన వక్షోజాలు, సన్నటి నడుము ఉండే స్త్తీలలో మహిళా
హార్మోన్లు ఎక్కువగా ఉంటాయట. అందుకే పురుషుల చూపులు వాటిపై పడతాయని
అధ్యయనంలో తేలింది. వక్షోజాల సైజుతో సంబంధం లేకుండా పురుషులు వాటిని చూడడం
ద్వారా ఆనందాన్ని పొందుతారని డైలీ టెలిగ్రాఫ్ వ్యాఖ్యానించింది. పురుషులు
ఎక్కువ కాలం స్త్రీ వక్షోజాలపైనే దృష్టి పెడుతున్నట్లు న్యూజిలాండ్‌లోని
విల్లింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధనల్లో కూడా తేలింది.