హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఎలా ఖతం చేయాలనే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించకపోతే కాంగ్రెసును లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకు ఆయన మధ్యంతర ఎన్నికలను కోరుకుంటున్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే కనీసం 55 సీట్లలో గ్యారంటీగా విజయం సాధిస్తామని ఆయన భావిస్తున్నారు. అయితే, 70 సీట్ల దాకా ఎటూ పోవనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసుకు తెలంగాణలో పుట్టగతులుండవని నిరూపించాలని ఆయన తహతహలాడుతున్నట్లు సమాచారం.
ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే తెలంగాణపై కప్పదాటు వైఖరి అవలంబించే అవకాశాలున్నాయని అంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చకు అన్ని పార్టీల నుంచి ఇద్దరేసి సభ్యులను ఆహ్వానించడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఆ కమిటీ నివేదిక అధ్యయనానికి తమకు సమయం కావాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, తెలుగుదేశం పార్టీ నాయకులు కోరే అవకాశం ఉంది.
అందుకు కొన్ని నెలల గడువు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అందువల్ల తమ లక్ష్యసాధన అంత సులభం కాదనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసుకు నామరూపాలు లేకుండా చేయడం తప్ప మరో మార్గం లేదనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే పనిని వైయస్ జగన్ చేపడితే బాగుందనేది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు

No comments:
Post a Comment