Friday, December 31, 2010

న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం

Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం కీలకమైన చర్చ జరిగింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని ఆరా తీసినట్లు సమాచారం. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు చిదంబరం శ్రీకృష్ణ కమిటీ అంశాలను వివరించినట్లు సమాచారం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతులను చిదంబరం కోర్ కమిటీ సభ్యులకు అందించారు. ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సోనియాతో పాటు కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, చిదంబరం పాల్గొన్నారు.

తెలంగాణపై జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత వ్యూహాన్ని ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికను, దాని సిఫార్సులను యుపిఎ మిత్రపక్షాలకు కూడా వివరించే అవకాశాలున్నాయి. మిత్ర పక్షాల అభిప్రాయం తీసుకున్న తర్వాత తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో
సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు

No comments: